calender_icon.png 11 November, 2025 | 8:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

11-11-2025 07:20:01 PM

సిద్దిపేట క్రైమ్: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం(ఫ్లాగ్ డే) కార్యక్రమాలలో భాగంగా మంగళవారం జిల్లాలోని వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. “డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర - విద్యార్థులు డ్రగ్స్ కు ఎలా దూరంగా ఉండాలి” అనే అంశంపై నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం విజేతలకు పోలీస్ కమిషనర్‌ విజయ్ కుమార్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సీహెచ్ కుశాల్కర్ పాల్గొన్నారు.