calender_icon.png 11 November, 2025 | 9:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పశు వైద్యాధికారిని నియమించాలంటూ నిరసన

11-11-2025 08:19:23 PM

మఠంపల్లి: మఠంపల్లి మండలంలోని పెదవీడు గ్రామంలో ఉన్న ప్రభుత్వ పశువైద్యాశాలలో వైద్యాధికారి లేక రైతులు తీవ్రఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి పశువైద్యాధికారిని నియమించాలని పెదవీడు మాజీ ఎంపిటిసి కుందూరు వెంకట్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఆయన మాజీ ఉపసర్పంచ్ వేముల పిచ్చయ్య, రైతులతో కలసి పశువైద్యశాల ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో 80 శాతం పాడి పంటల మీదనే జీవించడం జరుగుతున్నది.

క్కడ పశు వైద్యాలశాలలో కనీసం కాంపౌండర్ కూడా లేని పరిస్థితి ఉందని, గత ప్రభుత్వంలో ఎన్సీఎల్ సహకారంతో ఒక కాంపౌండర్ ని నియమించడం జరిగిందని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాంపౌండర్ కూడా తీసివేశరన్నారు. ఈ ప్రభుత్వంలో పెదవీడు గ్రామంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు పందిరి గోపిరెడ్డి, మాజీ వార్డు నెంబర్ నబి, బిజెపి గ్రామ అధ్యక్షుడు స్వాముల నరసింహారెడ్డి నాయకులు వీరారెడ్డి,మన్యం కర్ణ వీరారెడ్డి, పాశం మధుసూదన్ రెడ్డి,  హజార్ పాల్గొన్నారు.