calender_icon.png 11 November, 2025 | 8:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిశోధన దృక్పథం పెంపునకు క్షేత్ర సందర్శనలు

11-11-2025 07:27:35 PM

పట్టు పరిశ్రమలో ఆదర్శ విద్యార్థుల అధ్యయనం..

కాటారం (విజయక్రాంతి): క్షేత్ర సందర్శనలు విద్యార్థుల్లో సాంకేతిక అవగాహన, పరిశోధన దృక్పథం, వృత్తి విద్య పట్ల ఆసక్తిని పెంపొందిస్తాయని ఆదర్శ విద్యా సంస్థల చైర్మన్ జనగామ కరుణాకర్ రావు, కరస్పాండెంట్ జనగామ కార్తీక్ రావులు అన్నారు. ఆదర్శ హైస్కూల్ విద్యార్థులను పుస్తక జ్ఞానంతో పాటు జీవిత నైపుణ్యాలు, విలువల ఆధారిత విద్యపై దృష్టి సారించేలా తీర్చిదిద్దుతోందన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని ఆదర్శ హైస్కూల్ విద్యార్థులు "సిల్క్ టూ స్కిల్" కార్యక్రమంలో భాగంగా కాటారం, మహదేవపూర్ మార్గ మధ్యలోని అటవీ ప్రాంతంలో గల టస్సర్ పట్టు పరిశ్రమను సందర్శించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు టస్సర్ పట్టుపురుగుల పెంపకం, పట్టు తీయడం, తంతు తయారీ, వస్త్ర నేయడం వంటి ప్రక్రియలను ప్రత్యక్షంగా గమనించారు. అదేవిధంగా విద్యార్థులు టస్సర్ కాలనీని సందర్శించి, పట్టుతో వస్త్రాలను తయారు చేసే విధానం, ఉపయోగించే యంత్రాల రకాలు, వృత్తిదారుల జీవనశైలి, లాభ–నష్టాలు వంటి అంశాలను అనుభవాత్మక అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా సెరికల్చర్ అధికారి సమ్మయ్య పట్టు ఉత్పత్తి విధానం, రైతుల పాత్ర, పట్టు పరిశ్రమ, గ్రామీణ ఆర్థికాభివృద్ధికి కలిగించే ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు ఆసక్తిగా ప్రశ్నలు అడిగి, ప్రాయోగిక జ్ఞానం పొందారు. 21 వ విద్య విధానంలో భాగంగా చదువు, పరిశీలన  అన్వయించడం వంటి అంశాలను నేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వేణుగోపాల్, అక్బర్, శ్రీశైలం, శిరీష, లావణ్య, తదితరులు పాల్గొన్నారు.