11-11-2025 08:33:49 PM
జడ్చర్ల: డాక్టర్ బీ.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతినీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.సుకన్య మాట్లాడుతూ భారత జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1888 నవంబర్ 11న మక్కాలో జన్మించారని. ఆజాద్ అసలు పేరు అబుల్ కలాం మొహిద్దీన్ ఖైరుద్దీన్. చిన్ననాటనే అరబిక్, పర్షియన్, టర్కిష్, ఉర్దూ భాషలలో ఆజాద్ మంచి పాండిత్యం సంపాదించరని, ఆయన తన 12వ ఏట 'నైరంగ్-ఎ-ఆలం'పత్రికను వెలువరించారు. ఆయన 13వ ఏటన అద్భుత సాహిత్య విమర్శను సృజియించి 'విద్యాగని, సలక్షణ శోభితుడు, మహాకవి, సాటిలేని విద్వాంసుడు'గా ప్రశంసలందుకున్నరని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.సుకన్య తెలిపారు.
చరిత్ర అధ్యాపకులు రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు భారత దేశ మొదటి విద్యాశాఖ మంత్రి గా పనిచేసి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చారని తెలిపారు.మరియు 1904లో జరిగిన అఖిల భారత ముస్లిం విద్యాసదస్సులో, అఖిల భారత ముస్లిం పత్రికా సంపాదకుల సమావేశాల్లో పాల్గొనటంతో ఆజాద్ ప్రజా జీవితంలో ప్రవేశించి, ఆల్ హిలాల్ అనే పత్రికను ప్రచురించి స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజలను చైతన్యం చేశారని పేర్కొన్నారు గాంధీజీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం లో , ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని పలు మార్లు జైలు శిక్ష అనుభవించారని 1940 తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడు గా 1946 వరకు కొనసాగరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి సుకన్య అధ్యాపకులు రాఘవేంద్ర రెడ్డి, యన్ ఎస్ ఎస్ అధికారి మాధురి, నాగరాజు, నంద కిషోర్, శివుడు, నరసింహ, విద్యార్థులు పాల్గొన్నారు.