11-11-2025 08:23:21 PM
కరీంనగర్ (విజయక్రాంతి): భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి, భారతరత్న, మాజీ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు యం.డి.తాజుద్దీన్ ఆధ్వర్యంలో మంగళవారం డిసిసి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు. నగర కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు అహ్మద్ అలీ ఆధ్వర్యంలో నగరంలోని ఖాన్ పుర గల్ఫ్ హై స్కూల్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి నగర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.ఏ. మోసిన్ హాజరై విద్యార్థులకు పెన్నులు, నోటుబుక్కులు, ఎగ్జామ్ ప్యాడ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, పులి ఆంజనేయులు గౌడ్, కర్ర సత్య ప్రసన్న రెడ్డి, ముస్తాక్ అహమ్మద్ , నేహాల్ అహ్మద్, అబ్దుల్ రహమాన్,ఆరిఫ్, దన్ను సింగ్ మహమ్మద్ చాంద్ , మహమ్మద్ ఇమ్రాన్, హాజీ, సర్వర్ ఖాన్, ఫిరోజ్, సలీముద్దీన్, ఇర్ఫాన్, అబ్దుల్ బారి, బషీరుద్దీన్, సయ్యద్ జమాలుద్దీన్, బొబ్బిలి విక్టర్, తదితరులు పాల్గొన్నారు.