calender_icon.png 11 November, 2025 | 9:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీలో వివిధ పార్టీల నుండి 150 కుటుంబాలు చేరిక

11-11-2025 08:28:41 PM

కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే పాయం..

ఆళ్ళపల్లి (విజయక్రాంతి): మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి సుమారు 150 కుటుంబాలు మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వీరిని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ కండువాలు కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు. మంగళవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి శాసనసభ్యులు పాయం హాజరైన సందర్భంగా అనంతోగు గ్రామపంచాయతీ, తిర్లాపురం గ్రామం నుండి పాయం సూరయ్య ఆధ్వర్యంలో 70 కుటుంబాలు అలాగే రామానుజ గూడెం పంచాయితీ, రామానుజ గూడెం గ్రామం, ఇప్పనపల్లి గ్రామం, తునికి బండల గ్రామాల నుండి మోకల శేఖర్ ఆధ్వర్యంలో 80 కుటుంబాలు శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది.

ఈ సందర్భంగా శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సమస్య రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రధాన అజెండాగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని అన్నారు. ఇప్పటికే ప్రతి గ్రామంలో సిసి రోడ్లు మంజూరు చేయడం జరిగిందని దాని ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలు రవాణా వ్యవస్థ మెరుగుపడిందని అన్నారు ప్రతి గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేయడం జరిగిందని  ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు.

రైతులకు ఆర్థిక వరుస కనిపిస్తూ రైతు భరోసా రుణమాఫీ సాగునీరు అందిస్తుందని అలాగే మహిళలను సాధికారత దిశగా ప్రభుత్వం పని చేస్తుందని ఇప్పటికే ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని అన్నారు. అతి తక్కువ కాలంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఆహార భద్రతా కార్డులను అందించిన ఘనత కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ప్రతి పేదవాడికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రానున్న రోజుల్లో మరెన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజలకు బాసటగా నిలుస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాయం రామ నర్సయ్య  ప్రచార కమిటీ మండల అధ్యక్షులు వాసం శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు వాసం శ్రీనాథ్ ఎస్టీ సెల్ అధ్యక్షులు మోకల శేఖర్ ఎస్సీ సెల్ అధ్యక్షులు నులకతాటి శ్రీనివాస్  మండల సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ పడిగ సమ్మయ్య మాజీ ఎంపీపీ పెండేకట్ల పాపారావు సీనియర్ నాయకులు ఎండి హతర్ బుర్ర వెంకన్న బూత్ కమిటీ సభ్యుడు కరకపల్లి సుధాకర్  వసంతరావు తాళ్లపల్లి వెంకన్న  అగ్ని  చంద రాంబాబు కొరస నాగేశ్వరరావు పాయం సూరయ్య  గొగ్గెల కాంత్  మైనార్టీ సెల్ నాయకులు షాబీర్  బీసీ సెల్ అధ్యక్షులు తాళ్లపల్లి చిరంజీవి  భాస్కర్   యూత్ నాయకులు సుతారి కృష్ణ భరత్  ప్రశాంత్ నల్లమాస చంద్రబాబు మంద సాయి వనపర్తి నాని ముప్పారు రాము తోట రాజేష్ బొబ్బిలి రామ నరసయ్య పడిగ రామారావు కాంగ్రెస్ మహిళ నాయకురాలు వాసం సుశీల పర్వీన్ గలిగ సమ్మక్క మడత కుమారి  సుగుణ తదితరులు పాల్గొన్నారు.