11-11-2025 08:26:15 PM
కోదాడ: ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల సంఘటన సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ ఆదేశాల మేరకు జిల్లాలో పోలీసు శాఖ భద్రత చర్యల్లో భాగంగా కోదాడ పట్టణంలో జిల్లా పోలీస్ భద్రతా విభాగం పోలీసులు మంగళవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పౌరుల భద్రతాకు అధిక ప్రధాన్యం ఇస్తూ ఈ తనిఖీలు చేశారు. తనిఖీల్లో పాల్గొన్న డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసు. బస్టాండ్, కూరగాయల మార్కెట్, షాపింగ్ మాల్స్ వద్ద విస్తృత తనిఖీలు నిర్వహించారు. బస్సులు నిలుపు ప్రాంగణాలను, దుకాణాలు బస్సులు, ప్రయాణికుల లగేజీ అనుమానిత వ్యక్తులను తనిఖీ చేశారు. పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.