11-11-2025 08:14:52 PM
మఠంపల్లి: మఠంపల్లి మండలంలోని సర్వమతసామాజిక సేవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన భారత మొట్టమొదటి విద్యశాఖ మంత్రి మౌలాన అబుల్ కలాం ఆజాద్ జయంతి, మైనార్టి డే జాతీయ విద్యాదినోత్సవం సందర్భంగా మఠంపల్లి మండలం సర్వమత సామాజిక సేవ సంఘం వారి సౌజన్యంతో దాదాపుగా 300 మంది విద్యార్థిని, విద్యార్దులకు పరీక్ష ప్యాడ్స్ పెన్నులు ఈ సందర్భంగా అందించటం జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మండల ఎంఇఓ వెంకట చారి మాట్లాడుతూ విద్యార్థులు మంచి క్రమశిక్షణతో విద్య బుద్ధులు అలవర్చుకోవాలి, సర్వమత సామాజిక సేవా సంఘం ఆధ్వర్యంలో మఠంపల్లి మండలంలోని మఠంపల్లి, చౌటపల్లి,పెదవీడు జెడ్పిహెచ్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని, విద్యార్దులకు పరీక్ష ప్యాడ్ లు బహాకరించటం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ప్రాధానోపాధ్యాయులు, సర్వమత సామాజిక సేవా సంఘం పెద్దలు గ్రామ ప్రజలు ప్రముఖులు పాల్గొన్నారు