calender_icon.png 4 October, 2025 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్తు పదార్థాల అనర్థాలపై విస్తృత ప్రచారం చేయండి

04-10-2025 08:58:37 PM

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి 

కరీంనగర్,(విజయక్రాంతి): నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ నెలాఖరు వరకు విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తూ మత్తు పదార్థాల అనర్థాలపై విస్తృత ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలో నిర్వహించవలసిన వివిధ కార్యక్రమాలపై మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు.

కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం జరిగిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ యువత, విద్యార్థులు మాదక ద్రవ్యాల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందన్నారు. అక్టోబర్ నెలాఖరు వరకు జిల్లాలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను వివరించాలని అన్నారు. పోలీస్, ఎక్సైజ్, డిఆర్డిఓ, మెప్మా, విద్య, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, తదితర శాఖలు సమన్వయంతో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ఈ అవగాహన కార్యక్రమాల్లో భాగస్వామ్యులను చేయాలని తెలిపారు. ముఖ్యంగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, మెడికల్ కళాశాలల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు.

మాదకద్రవ్య వ్యతిరేక సందేశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించాలని అన్నారు. మాదకద్రవ్య రహిత భారత్ గురించి యువతకు వివరించేలా డ్రాయింగ్ కాంపిటీషన్ ఏర్పాటు చేయాలని అన్నారు. పెద్ద ఎత్తున మారథాన్ నిర్వహించి మాదకద్రవ్యాల అనర్థాలపై ప్రజలకు సందేశం ఇవ్వాలని సూచించారు. సామూహిక ప్రతిజ్ఞ చేయించాలని, ప్రతిజ్ఞను సూచించే ఆన్లైన్ క్యూఆర్ కోడ్ ను జనసందోహం ఉన్నచోటట్ల  ప్రదర్శించాలని సూచించారు. అనంతరం నషా ముక్త్ భారత్ ప్రతిజ్ఞకు సంబంధించిన క్యూఆర్ కోడ్ ను ఆవిష్కరించారు.