calender_icon.png 4 October, 2025 | 11:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు ఎరువుల పంపిణీ సక్రమంగా చేపట్టాలి

04-10-2025 08:57:38 PM

ఎరువుల పంపిణీ, నిల్వలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి..

గాంధారి (విజయక్రాంతి): రైతులకు ఎరువుల పంపిణీ సక్రమంగా చేపట్టాలని కామారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం రోజున గాంధారి మండల కేంద్రంలోని ఉన్నటువంటి సొసైటీ ఫర్టిలైజర్ దుకాణాలలో నిల్వ ఉన్నటువంటి ఎరువుల వివరాలను పంపిణీ వివరాలను పరిశీలించారు. అనంతరం స్టాఫ్ రిజిస్టర్ను కూడా పరిశీలించి తగు సూచనలు సలహాలు తెలియజేశారు. ఎరువుల పంపిణీ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు సకాలంలో అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజా లింగం, ఫర్టిలైజర్ యజమానులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.