22-10-2025 04:08:05 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): ఈ నెల 24న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి ఎన్ ఎన్ ఎస్ ప్రోగ్రామ్ అధికారుల సమావేశం ఉంటుందని మంచిర్యాల జిల్లా జాతీయ సేవా పథకం కన్వీనర్ డాక్టర్ ఉదారి చంద్రమోహన్ గౌడ్ బుధవారం తెలిపారు. జిల్లా కేంద్రంలోనీ వివేకవర్ధిని డిగ్రీ, పీజీ కళాశాలలో ఉదయం 10 గంటలకు జరిగే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కే ప్రతాప్ రెడ్డి, కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ నారాయణ వస్తున్నారని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జూనియర్, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్, జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ అధికారులు 2024 -25 సంవత్సరానికి గాను రెగ్యులర్ ఆక్టివిటీస్, స్పెషల్ క్యాంప్ లకు సంబంధించిన రిపోర్టును తీసుకురావాలని ఆయన కోరారు. 2025-26 సంవత్సరం యాక్షన్ ప్లాన్, వాలంటీర్స్ డాటాని సైతం తీసుకురావాలని సూచించారు.