11-12-2025 12:10:56 AM
కొత్తపల్లి, డిసెంబర్ 10(విజయక్రాంతి):‘ఎథ్నిక్ డే‘ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయ వాణిజ్య, వ్యాపార కళాశాల ప్రతి సంవత్సరం నిర్వహించే ఒక సాంస్కృతిక కార్యక్రమం బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య యు ఉమేష్ కుమార్ ముఖ్య అతిధిగా తన సతీమణితో సాంప్రదాయ దుస్తులలో వచ్చి కృష్ణాష్టమి ప్రతీక అయిన ఉట్టి కొట్టి కార్యక్రమన్ని ప్రారంభించి మాట్లాడుతూ అధ్యాపకులు,
విద్యార్థులు సాంప్రదాయాలను మరవకూడదని, జాతి గౌరవాన్ని పెంపొందించే ఆచారాలను ముందుకు తీసుకెళ్లాలని, తమ ఆచారాలకు సంబందించిన పండగలను జరుపుకొని జాతి ఐక్యతకు, భిన్నత్వంలో ఏకత్వం అనే భావనకు కట్టుబడి ఉండి దేశ సంస్కృతిని గౌరవించాలని పిలుపునిచ్చారు. తదుపరి విశిష్ట అతిథిగా విచ్చేసిన విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య జాస్తి రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థులు సంప్రదాయానికి ప్రతీకలైన వినాయక చవితి, దసరా, దీపావళి, క్రిస్మస్, రంజాన్, బతుకమ్మ, సంక్రాంతి మొదలైన పండగలను జరుపుకోవడం చాలా ఆనందకరమని ఈ సాంప్రదాయాలను ముందుకు తరాలకు తీసుకెళ్లాలని తెలియజేశారు.
వాణిజ్య కళాశాల ప్రిన్సిపాల్, కార్యక్రమ అధ్యక్షులు డాక్టర్ హరికాంత్ మాట్లాడుతూ ఈ సాంప్రదాయ దినోత్సవాన్ని జరుపుకోవటమే తమ కళాశాల ఆచారమని విద్యార్థులు ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంగా ఈ ఎత్నిక్ డే ను జరుపుకుంటామని ఇది కళాశాల విద్యా సంవత్సరంలో భాగమైందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి డా. డి సురేష్ కుమార్, సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డా. ఎస్ రమాకాంత్, ఆరట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సూరేపల్లి సుజాత, అధ్యాపకులు డా.నజిముద్దీన్ మున్వర్, డా.పద్మావతి, డా.శ్రీవాణి,డా.కృష్ణ కుమార్, డా. తిరుపతి, డా. మనోజ్ కుమార్, డా.నరేష్, డా.పరశురాం, సావిత్రి, బోధనేతర సిబ్బంది,విద్యార్థిని విద్యార్థినులుపాల్గొన్నారు.