calender_icon.png 2 May, 2025 | 8:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరణించినా... చూడండి

26-04-2025 12:27:22 AM

- నేత్రదానం చేసేందుకు ముందుకు రండి 

- ఇద్దరికి చూపును ప్రసాదించి ఆదర్శంగా నిలిచిన నారాయణరెడ్డి 

మహబూబ్ నగర్ ఏప్రిల్ 25 (విజయ క్రాంతి) : మరణించిన మరో మారు ప్రపంచాన్ని చూసే అద్భుత అవకాశం నేత్రదానం చేయడం వల్లే లభిస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న విశ్రాంత హెచ్‌ఎం నారాయణరెడ్డి  మహబూబ్ నగర్ రూరల్ మండలం బొక్కలోని పల్లి గ్రామానికి చెందిన విశ్రాంత హెచ్ యం నారాయణ రెడ్డి (82) అనారోగ్య కారణాలతో మృతి చెందారు.

తన మరణాంతరం నేత్రాలు దానం చేయాలని నారాయణ రెడ్డి ఆఖరి కోరిక మేరకు ఆయన కుటుంబ సభ్యులు రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ కు సమాచారం అందించారు. ఈ మేరకు ఎల్.వి. ఆసుపత్రి కి చెందిన టెక్నిషియాన్ శివ సత్వరమే స్పందించి మృతుడు నారాయణ రెడ్డి ఇంటికి చేరుకొని ఆయన నుంచి కార్నియాను సేకరించి నారాయణ రెడ్డి భార్య వెంకటమ్మ, కుమార్తె కృష్ణ కుమారి, మనుమరాలు డాక్టర్ గాయిత్రి వారి కుటుంబ సభ్యులకు ధృవీకరణ పత్రాలు అందజేశారు. నేత్ర దానం చేసేందుకు ముందుకు వచ్చే వారు 9666900900 కు సంప్రదించాలని రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ తెలిపారు.