calender_icon.png 5 July, 2025 | 11:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పలు పాఠశాలలలో మెడికల్ క్యాంపులు నిర్వహించిన డాక్టర్ అభినవ్

05-07-2025 05:08:24 PM

కన్నాయిగూడెం (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) కన్నాయిగూడెం మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల హాస్టల్లో గౌరవ జిల్లా కలెక్టర్, డిఎం&హెచ్ఓ ఆదేశాల ప్రకారం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ అభినవ్(Medical Officer Dr. Abhinav) ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఆరోగ్య ఉప కేంద్రాలు చిన్నబోయిన పల్లె ఆశ్రమ పాఠశాలలో కొండాయిలోని ఆశ్రమ పాఠశాల, కన్నాయిగూడెం ఆశ్రమ పాఠశాల, ముప్పనపల్లి కస్తూరిబా పాఠశాల, తుపాకులగూడెం ఆశ్రమ పాఠశాలలలో మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది.

ఇందులో జ్వరంతో జలుబు, ఇతర కారణాలతో ఉన్నవారికి ఆరోగ్య పరీక్షలు, రక్తపరీక్షలు నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు వ్యక్తిగత శుభ్రత గురించి, పరిసరాల పరిశుభ్రత గురించి తీసుకునే ఆహారంలోని పోషకాహారాల గురించి విద్యా బోధన చేయడం జరిగింది. ఇందులో డాక్టర్ అన్మిష, డాక్టర్ ప్రణీత్, డాక్టర్ వరప్రసాద్, డాక్టర్ స్నేహ రెడ్డి వీరితో పాటు ఆ గ్రామాలలోని హెల్త్ అసిస్టెంట్ భాస్కరరావు, లక్ష్మణ్, కవిత సమ్మక్క పుణ్యవతి సబిత, ఆ గ్రామాల పరిధిలోని ఆశా వర్కర్లు పాల్గొన్నారు.