05-07-2025 05:01:29 PM
ములుగు (విజయక్రాంతి): వరంగల్ మామూనూరులోని జవహర్ నవోదయ విద్యాలయం(Jawahar Navodaya Vidyalaya)లో 2026-27 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశాలకు 13 డిసెంబర్ 2025 నాడు ఎంపిక పరీక్ష నిర్వహించబడుతుందని అదనపు కలెక్టర్ రెవిన్యూ సిహెచ్ మహేందర్ జి(Additional Collector CH Mahenderji) తెలిపారు. శనివారం అదనపు కలెక్టర్ రెవిన్యూ సిహెచ్ మహేందర్ జి తన ఛాంబర్లో ప్రిన్సిపాల్ బి. పూర్ణిమతో కలిసి జవహర్ నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రస్తుత విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ మే 1, 2014 నుండి జూలై 31, 2016 మధ్య జన్మించిన విద్యార్హులు ఎంపిక పరీక్షకు అర్హులు అన్నారు. విద్యార్థులు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 3, 4వ తరగతులు చదివి ఉండాలన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు జూలై 29వ తేదీలోగా ఆన్‌లైన్‌లో www.navodaya.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మిగతా వివరాలకు హెల్ప్ లైన్ 9110782213, 7993263431 నంబర్లను సంప్రదించాలన్నారు.