calender_icon.png 5 July, 2025 | 10:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా శక్తి భవనం పనులు వేగవంతం చేయాలి

05-07-2025 04:51:26 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే..

కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): మహిళా శక్తి భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే(District Collector Venkatesh Dhotre) అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న మహిళా శక్తి భవనం నిర్మాణ పనులను పంచాయతరాజ్ ఈఈ అజ్మీర కృష్ణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుందని అందులో భాగంగా 5 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులతో చేపడుతున్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలన్నారు. అక్టోబర్ నెల చివరిలోగా పనులు పూర్తిచేసి ప్రభుత్వానికి అప్పగించాలని సదరు గుత్తేదారును ఆదేశించారు.

పనులలో నాణ్యత ఉండేలా ఇంజనీరింగ్ అధికారులు ఈ రోజు పర్యవేక్షించాలని తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలో జనకాపూర్ లో గల ఆర్. ఆర్. కాలనీలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హత గల ప్రతి లబ్ధిదారుడికి ఇల్లు అందించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పనులు వేగవంతం చేయాలని, బేస్ మెంట్ వరకు పూర్తి చేసుకున్న ఇండ్లకు సంబంధించి వివరాలు పోర్టల్ లో నమోదు చేయడం ద్వారా ప్రతి సోమవారం ఇందిరమ్మ లబ్ధిదారుల ఖాతాలో నిధులు జమ చేయడం జరుగుతుందని తెలిపారు.నిర్మాణ పనులను వేగవంతం చేయాలని,ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తుందని, లబ్ధిదారులు మీ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్ గజానంద్, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.