05-07-2025 05:11:35 PM
ములకలపల్లి (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ జగన్నాధపురం, ములకలపల్లి గ్రామాల్లో ఏఐటియుసి అనుబంధ గ్రామపంచాయతీ, భవన నిర్మాణ, హమాలీ కార్మికుల సంఘం, సిఐటియు అనుబంధ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం విస్తృత ప్రచారం నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యదర్శులను కలిసి సమ్మె నోటీసు అందజేశారు. ఎరువుల దుకాణాల ఇనుప దుకాణాలు, రైస్ మిల్లర్లు, హోటళ్ల యజమానులను కలిసి సమ్మెకు సహకరించాల్సిందిగా కోరారు. ప్రధాన కూడళ్లలో ప్రజలను కలుసుకొని సమ్మె యొక్క ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నుంచి ఎండి యూసుఫ్, ఎస్ కే జబ్బార్, సిఐటియు నుండి చిక్కుల శీను, గంటా శీను, రుక్మాదరావు, సాయి రత్న, చిన్నయా తదితరులు పాల్గొన్నారు.