05-07-2025 05:19:02 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నట్లు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ దుర్గం మహేశ్వర్(Principal Durgam Maheshwar) తెలిపారు. గతంలో ఆదర్శ పాఠశాల ఆరో తరగతి ప్రవేశ పరీక్ష రాసి సీటు రానివారు అర్హులని తెలిపారు. అట్టి అభ్యర్థులు ఈ నెల 7న(సోమవారం) ఉదయం 10 గంటలకు నుండి 12 గంటల లోపు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి స్పాట్ అడ్మిషన్ పొందగలరని ప్రిన్సిపల్ ఒక ప్రకటన తెలిపారు.
త్రిబుల్ ఐటీకి విద్యార్థుల ఎంపిక...
జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు త్రిబుల్ ఐటీలో ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ దుర్గం మహేశ్వర్ శుక్రవారం తెలిపారు. త్రిబుల్ ఐటీ ప్రకటించిన జాబితాలో మోడల్ స్కూల్ కు చెందిన విద్యార్థులు గుండేటి వర్షిత్ ,ఉమెజా నాజ్ త్రిబుల్ ఐటీ కి ఎంపిక కావడం పట్ల వారిని పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.