calender_icon.png 5 July, 2025 | 10:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్‌ సభకు వస్తానంటే.. చర్చ పెడతాం: జగ్గారెడ్డి

05-07-2025 04:42:41 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్‌, బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్‌ రావు సెకండ్‌ బెంచ్‌ లీడర్స్‌ అని, సాధారణంగా ప్రతిపక్షం అసెంబ్లీలో చర్చిద్దాం అని డిమాండ్‌ చేస్తుందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. కానీ ఇక్కడ సీన్‌ రివర్స్‌.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ పెడతామంటే, ప్రతిపక్ష నేత చర్చకు రావాలని కోరుతున్నారు. కేసీఆర్‌ సభకు వస్తానంటే.. రేవంత్‌ రెడ్డి సభ పెడతామని చెబుతున్నారని జగ్గారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో సంపత్ కుమార్ సభ్యత్వమే రద్దు చేసిందని, కానీ పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని అరాచకాలు చేసిందని వెల్లడించారు. ప్రతిపక్ష నేతతో సహా ఎంతో మంది ఫోన్లు ట్యాప్ చేయించారని మండిపడ్డారు.