10-12-2025 01:47:04 AM
ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆదిలాబాద్ అంతా బాగుపడాలని తపనతో పని చేస్తున్నానని, ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గ్రామ పంచాయితీ ఎన్నికల ప్రచారం లో బాగంగా ఆదిలాబాద్ రూరల్ మండలంలోని మావల, భీంసరి తదితర గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను విన్నవించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ... పంచాయతీ ఎన్నికల్లో సమర్ధులను గెలిపిస్తే గ్రామానికి నిధులు తీసుకువచ్చేందుకు తనవంతుగా కృషి చేస్తానని పేర్కొ న్నారు. ఆదిలాబాద్ ప్రజలు ఎంతో కాలం ఎదురు చూస్తున్న ఎయిర్పోర్టును తీసుకువచ్చేందుకు ఎంతో కృషి చేయడం జరిగిం దన్నారు. గ్రామాల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే బాధ్యత తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారు. ఈకార్యక్రమంలో బీజేపీ నాయకులు ముకుంద్, రఘుపతి, దయాకర్, ఆకుల ప్రవీణ్, గంగాధర్, గ్రామస్థులు పాల్గొన్నారు.