01-08-2025 12:20:21 AM
బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా.కురువ విజయ్ కుమార్
గద్వాల జూలై 31 : పార్టీ పిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విషయం లో సుప్రీం తీర్పు తోనైనా కాంగ్రెస్ పార్టీ కి సి ఎం రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం కలగాలని బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా.కురువ విజయ్ కుమార్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో BRS పార్టీ రాష్ట్ర నాయకులు డా.కురువ విజయ్ కు మార్ మాట్లాడారు.
ఎమ్మెల్యేల పిరాయింపుపై మూడునెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను ఆదేశించడం దేశ శాసన చరిత్రలో కెలకమైన పరిణామం అని ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడే తీర్పు అన్నారు. సిగ్గు శరం ఉంటె పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి ఉపఎన్నికలకు సిద్ధపడాలని ఆయన డిమాండ్ చేశారు. బి ఆర్ ఎస్ పార్టీ నుంచి గు లాబి జేండాతో, కెసిఆర్ ఫొటోతో గెలిచి కోట్లాది రూపాయలకు అమ్ముడు పోయిన గద్వాల ఎ మ్మెల్యే కూడా రాజీనామా చేసి గద్వాల లో ఉపఎన్నికలకు సిద్ధపడాలని ఆయన హితవు పలికారు.
సుప్రీం కోర్టు తీర్పును స్పీకర్ గౌరవించి పది మంది ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వే యాలని స్పీకర్ పిటిషన్ ఇచ్చిన ఏడు నెలల తర్వాత ఎమ్మేల్యేలకు నోటీసులు జారీ చేయడాన్ని త ప్పు పట్టడం బీ ఆర్ ఎస్ సాధించిన విజయమన్నారు. స్పీకర్ ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా స్వంతంత్రంగా వ్యవహరించి పిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయా లన్నారు. ఈ సమావేశంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు