01-08-2025 12:19:42 AM
ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే దన్‌పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్, జులై 31: (విజయ క్రాంతి): నిజామాబాద్ నగరంలోని 39వ డివిజన్, ఓల్ ఎన్జీఓఎస్ కాలనీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కమ్యూనిటీ భవన నిర్మాణానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ధన్ పాల్ సూర్యనారాయణ .
మాట్లాడుతు, ప్రజల అవసరాలకు అనుగుణంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణల అవసరం ఉందని అన్నారు, నిర్మా ణానికి ముందుకు వచ్చిన కాలనీ అసోసియేషన్ వారిని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అభినందించారు. ఇది స్థానిక కాలనీ వాసులకు వివిధ కార్యక్రమాల నిర్వహణకు ఎంతగానో ఉపయోగపడుతుందని నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ప్రజల ఉపయోగం కోసం నిర్మిస్తున్న కమ్యూనిటీ భవనం పనులు త్వరతగతిన ప్రారంభం అయ్యి ప్రజా ఉపయోగంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతంకర్ లక్ష్మినారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మినారాయణ, మాజీ కార్పొరేటర్ క్రిష్ణ, కొండా ఆశన్న, ఇల్లేందుల ప్రభాకర్, పార్షి రాజు కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.