calender_icon.png 6 October, 2025 | 9:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి పౌరునికి నివాసం కల్పించాలి

06-10-2025 06:56:44 PM

బలహీన వర్గాల సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజలింగు మోతె..

మందమర్రి (విజయక్రాంతి): సొంతింటి సౌకర్యం ప్రతి పౌరుని మౌలిక హక్కు అని ప్రభుత్వాలు పౌరులకు సొంతింటి సౌకర్యం కల్పించాలని తెలంగాణ బలహీనవర్గాల సంక్షేమ సంఘం అధ్యక్షులు, అడ్వకేట్ రాజలింగు మోతె డిమాండ్ చేశారు. పట్టణంలోని మార్కెట్ ఏరియాలో ప్రపంచ నివాస దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాలు పౌరుల సంక్షేమానికి కట్టుబడి ఉండాలనీ, అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు కాదని, ప్రతి కుటుంబానికి మచ్చిక ఇంటిని ఇవ్వడమే నిజమైన అభివృద్ధని ఆన్నారు. సొంతింటి సాకారం కావాలంటే హౌసింగ్ స్కీమ్స్, రుణ సబ్సిడీలు, తక్కువ ధరల ప్లాట్లు, పేదల కోసం ఉచిత గృహ నిర్మాణాలు వంటి చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలన్నారు.

పౌరుల మచ్చిక ఇల్లు అవసరాన్ని తీర్చే బాధ్యత ప్రభుత్వాలదే అని ఆయన స్పష్టం చేశారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ సొంత గృహం ఉండేలా చేయడం ప్రభుత్వాల కర్తవ్యమే కాదు, అది నైతిక బాధ్యత అని అన్నారు. పౌరుల కలలను నెరవేర్చే మార్గంలో ప్రభుత్వం తొలి అడుగు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీబీఎస్ఎస్ నాయకులు గోమాస శ్రీనివాస్, లింగంపల్లి అభిలాష్ లు పాల్గొన్నారు.