06-10-2025 07:00:23 PM
సనత్ నగర్ (విజయక్రాంతి): సనత్ నగర్ బాచుపల్లి, హైదరాబాద్లోని రవి రాక్స్ షోటోకాన్ కరాటే అకాడమీ అధ్యక్షుడు మాస్టర్ కె. రవి నాయక్, ఎస్.ఐ.వి.ఈ.టి కాలేజ్, థాంబరం, చెన్నై, ఆదివారం సాయంత్రం వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ సంస్థ నిర్వహించిన గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అతిపెద్ద కరాటే ప్రదర్శన(Largest Karate Display) విభాగంలో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించారు. ఈ కార్యక్రమంలో అనేక దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి అథ్లెట్లు పాల్గొన్నారు కానీ మాస్టర్ రవి నాయక్ విజయాన్ని ప్రత్యేకంగా నిలిపింది.
సాధారణ కుటుంబంలో పుట్టిన రవికి తగిన సదుపాయాలు లేకపోయినా.. ఆయన తన కలను వదిలిపెట్టలేదు. తనపై నమ్మకంతో, ఆయన ప్రతిరోజూ సాధన చేసేవాడు ఈ రోజు అదే పట్టుదల ఆయనను ప్రపంచ వేదికపైకి చేర్చింది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించి, బంగారు పతకం గెలిచే గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఈ రోజు ఆయన బాచుపల్లి సనత్ నగర్ లోని తన కరాటే అకాడమీ ద్వారావందలాది మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు.