మహేంద్ర హిల్స్‌లో చిన్నారుల యోగాసన విన్యాసాలు అమోఘం..
సికింద్రాబాద్, జూన్ 21(విజయక్రాంతి): ప్రపంచ యోగా దినోత్సవాన్ని పు రస్కరించుకుని, మహేంద్రహిల్స్ లో ఆదివారం యోగా వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో స్థానిక చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక శిక్షణ పొందారు. శిక్షణ అనంతరం చిన్నారులు ప్రదర్శించిన వివిధ రకాల క్లిష్టమైన యోగాసనాలు, వారి నైపుణ్యం చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
వీక్షకుల్లో యోగా పట్ల ఎంతో ఆసక్తిని, జిజ్ఞాసను రేకెత్తించేలా చిన్నారుల ప్రదర్శన సాగింది.ఈ సందర్భంగా యోగా సనాల్లో ప్రతిభ కనబరిచిన చిన్నా రులను ప్రోత్సహిస్తూ వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. మహేంద్రహిల్స్కు చెందిన ప్రముఖులు సుభాష్ గోయల్ ముఖ్య అతిథిగా హాజరై తన చేతుల మీదుగా చిన్నారులకు ఈ ప్రశంసా పత్రాలను బహూకరించి అభినందించారు. యోగా గురువు సాయిబాబాతో పాటు నరేష్, భగవత్, సుభాష్, సునీత తదితరులు పాల్గొన్నారు.






