calender_icon.png 8 May, 2025 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్మీడియట్ పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి యుడైస్ ప్లస్ పోర్టల్ నందు నమోదు అవ్వాల్సిందే

08-05-2025 05:19:48 PM

జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి యుడైస్ ప్లస్ పోర్టల్ నందు కచ్చితంగా నమోదు కావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్(District Collector Jitesh V. Patil) అన్నారు. గురువారం ఐడిఓసీ కార్యాలయంలో జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతంలో బాలికల కంటే బాలురు వెనుకబడి ఉండటానికి గల కారణాలను జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వరరావు అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ లో కూడా డిజిటల్ ఎడ్యుకేషన్, ఫేషియల్ అటెండెన్స్ ప్రవేశపెట్టేలా చూడాలన్నారు.

ఇంటర్మీడియట్ కళాశాలలో అతిపెద్ద మైదానాలు ఉన్నప్పటికీ ఇంకుడు గుంతల నిర్మాణం జరగడం లేదని, వెంటనే అన్ని కళాశాలల్లో ఎకరాకి ఐదు ఇంకుడు గుంతలు నిర్మించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇంటర్మీడియట్ కళాశాలలో పరీక్షకు హాజరైన సంఖ్యకు, యుడైస్ ప్లస్ నందు నమోదుకు చాలా తేడాలు ఉన్నాయని, అట్టి కళాశాల ప్రిన్సిపాల్ లను పిలిపించి జిల్లా విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో అందరూ ఇక్కడే విద్యార్థులందరినీ యుడైస్ ప్లస్ పోర్టల్ లో నమోదు చేసేలా చూడాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర చారి, కోఆర్డినేటర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.