calender_icon.png 8 May, 2025 | 9:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కవిత్వం సమాజాన్ని సంస్కరిస్తుంది

08-05-2025 05:26:26 PM

నిర్మల్ (విజయక్రాంతి): కవిత్వం సమాజాన్ని సంస్కరిస్తుందని ప్రముఖ సామాజికవేత్త రాంనాథ్ అన్నారు. ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన కవి యాత్ర 100 మందితో విజయవంతమైన సందర్భంగా నిర్మల్ లో ప్రముఖ కవి, కారం శంకర్  చిన్ననాటి మిత్రులు జరిపిన సన్మాన సభలో పాల్గొన్నారు. ఒక పోలీసు ఉద్యోగిగా ఉన్నప్పటికీ ఎలాంటి కఠినత్వం లేకుండా ఉండడం శంకర్ ప్రత్యేకత అని అన్నారు. కవిగా జాతీయ స్థాయికి ఎదిగి తానేమిటో నిరూపించుకున్నారని అన్నారు. అది తమకెంతో గర్వకారణం అని అన్నారు. సన్మాన గ్రహీత కారం శంకర్ మాట్లాడుతూ... సాహితీ ప్రయాణంలో తనకు ఎన్నో అవార్డులు వచ్చినప్పటికీ చిన్ననాటి మిత్రుల ఈ సన్మానము ఎంతో గొప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో మహేందర్, సోమేశ్వర్, శ్రీహరి శ్రీనివాస్, ఉమాపతి గంగా సురేష్, రాజన్న జె.మనోహర్, కే నరసింహ చారి, రమేష్, రాజేశ్వర్ పాల్గొన్నారు.