31 August, 2026 | 10:36 AM

Breaking News

నేరాల నియంత్రానికే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   40 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   హరీష్ నాయక్ కుటుంబానికి ఎంపీ ‘వేం’ పరామర్శ   •   రాష్ట్ర మహా సభల గోడ పత్రికల ఆవిష్కరణ   •   పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్‌బాబు   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి శ్రీధర్‌బాబు   •   నేడు మహబూబాబాద్ జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన   •   రిటైర్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలి: టీఎస్‌జీఆర్‌ఈఏ జిల్లా అధ్యక్షులు   •   తాజుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ పార్లమెంటరీ నేత   •   జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించం: మాటేటి వేణుగోపాల్   •  

కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి

29-06-2025 05:45 PM

చండూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు అనంత చంద్రశేఖర్ గౌడ్..

చండూరు (విజయక్రాంతి): వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని చండూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు అనంత చంద్రశేఖర్ గౌడ్(Congress President Anantha Chandrasekhar Goud) అన్నారు. ఆదివారం చండూరు మండల కేంద్రంలోని భారతి చంద్ర గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజల పక్షాన ఉంటూ, ప్రజా సమస్యల కోసం నిరంతరం కృషి చేయాలని ఆయన అన్నారు. చండూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డులో ఏ సమస్య ఉందో తమ దృష్టికి తీసుకురావాలని, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేస్తారో వారికే రాబోయే ఎన్నికలలో అవకాశాలు ఉంటాయని ఆయన అన్నారు.

చండూరు మున్సిపాలిటీ పరిధిలోని 10 వార్డులలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు పేద ప్రజలకు అండగా ఉంటుందని, నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన అన్నారు. చండూరు మున్సిపాలిటీ అభివృద్ధి రాజగోపాల్ రెడ్డి సహకారంతోనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు కోడి శ్రీనివాసులు,కాంగ్రెస్ పార్టీ కో-ఆర్డినేటర్ గంట సత్యం, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దోటి సుజాత వెంకటేష్ యాదవ్, మాజీ కౌన్సిలర్ మంచుకొండ కీర్తి సంజయ్, మాజీ ఎంపీటీసీ కారింగు రామ్మూర్తి, మాజీ సర్పంచులు కలిమికొండ జనార్ధన్, నల్లగంటి మల్లేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.