18-10-2025 12:28:08 AM
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల అర్బన్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): పార్టీ బలోపేతానికి కృషిచేసిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు దక్కేందుకు కృషి చేస్తామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాలలో కాంగ్రెస్ డీసీసీ అధ్యక్ష నియామకంపై సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశం శుక్రవారం జరిగింది.ఈ సమావేశంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని పార్టీ బలోపేతానికి అవసరమైన సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల ప్రకారం ప్రతి కార్యకర్తకు గుర్తింపు దక్కేలా, సమిష్టిగా పార్టీని మరింత బలపరచాల్సిన అవసరం ఉందన్నారు.కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణ దిశగా పార్టీ హైకమాండ్ తీసుకుంటున్న చర్యలకు తాము కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ పరిశీలకులు జై కుమార్, పిసీసీ పరిశీలకులు ఫక్రుద్దీన్ రాయ్, కేతురి వెంకటేష్, బాసిత్ లు పాల్గొని డీసీసీ అధ్యక్ష నియామక ప్రక్రియపై స్థానిక నాయకులతో చర్చలు జరిపారు.మాజీ మంత్రి జీవన్ రెడ్డి, కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు, మండల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ ప్రతినిధులు, యువజన, మహిళా, రైతు, మైనారిటీ విభాగాల నేతలు పాల్గొన్నారు.