calender_icon.png 18 October, 2025 | 9:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డిలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్

18-10-2025 12:27:26 AM

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: ట్రాఫిక్ ఎస్ఐ మహేష్ 

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డిలో శుక్రవారం ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రవేట్ పాఠశాల బస్సుల డ్రైవర్లకు, వాహనాల డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ మహేష్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితిల్లో మద్యం సేవించి స్కూల్ పిల్లల వాహనాలు స్కూల్ పిల్లల ఆటోలను నడపకూడదు అని తెలిపారు. ప్రతి డ్రైవరు వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రవేట్ పాఠశాలల బస్సులను, వాహనదారులను ట్రాఫిక్ పోలీసులు చెకింగ్ చేసి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.