calender_icon.png 11 September, 2025 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

11-09-2025 07:23:35 PM

సీఐ శివశంకర్..

కోదాడ: మహిళలు, విద్యార్థినులు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కోదాడ టౌన్ సీఐ శివశంకర్(CI Shiva Shankar) అన్నారు. కోదాడలోని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో గురువారం పోలీస్ భరోసా కార్యక్రమంలో భాగంగా పలు రకాల నేరాలు, మోసాలు, వాటి నియంత్రణపై విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినులకు సమస్యలుంటే అధ్యాపకులు, అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలని, బెట్టింగ్ యాప్ లకు బలి కావొద్దన్నారు. విద్యార్థులు పోలీస్ కేసుల్లో చిక్కుకుంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదురవుతాయని, మాదకద్రవ్యాలు, ఆన్ లైన్ జూదంలాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థినులు, మహిళలకు సమస్యలుంటే షీ టీం నంబర్ 87126 86056, సైబర్ మోసాలపై 1930, వేధింపులపై 100 నంబర్ కు సమాచారం ఇవ్వాలని సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై హనుమాన్ నాయక్, కళాశాల ప్రిన్సిపాల్ మాధురి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.