21-11-2025 12:00:00 AM
జిల్లా సివిల్ జడ్జి ఇందిర
రాజాపూర్, నవంబర్ 20 : ప్రజలందరికీ రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు భారత చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా సివిల్ జడ్జ్ ఇందిరా అన్నారు. గురువారం మండలంలో పర్యటించి ప్రభుత్వ చట్టాలపై అవగాహన కల్పించారు. ముందుగా గ్రామపంచాయతీ కార్యాలయంలో మండలంలోని సీనియర్ సిటిజన్స్ కు హక్కులు చట్టాలు న్యాయ సలహాల కోసం ముఖాముఖి సమావేశం నిర్వహించారు.
వృద్ధుల హక్కులు ఆస్తులకు సంబంధించి వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలతో పాటు కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. బాలికలు సమాజంలో ఎదుర్కొనే సమస్యలు లైంగిక వేధింపులు వంటి సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచించారు. సమస్య వస్తే ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులు పోలీసులను సంప్రదించాలని సూచించారు.
మైనర్ బాల బాలికలు తెలిసి తెలియని తనముతో ప్రేమలు పెళ్లిళ్లు అని తిరిగి జీవితాలు నాశనం చేసుకోవద్దని తెలిపారు. బాల బాలికలు సోషల్ మీడియాకు దూరంగా ఉంటేనే తమ భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు. అనంతరం కేజీబీవీ బాలికలతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోబీషనల్ అదనపు కలెక్టర్ అను మిత్ర,తాసిల్దార్ రాధాకృష్ణ,ఎంపీడీవో విజయలక్ష్మి,ఎస్‌ఐ శివానంద్ గౌడ్, ఎంపీఓ వెంకట్ రాములు, ప్రధానో పాధ్యాయులు సయ్యద్ ఇబ్రహీం, కేజీబీవీ ఎస్‌ఓ లక్ష్మీబాయి, కృష్ణవేణి, సుజాత పాల్గొన్నారు.