calender_icon.png 21 November, 2025 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

23న ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ 5కే రన్

21-11-2025 12:00:00 AM

ఖైరతాబాద్; నవంబర్ 20 (విజయ క్రాంతి) :  శాంతి  నెలకొనాలని ఆకాంక్షిస్తూ ఈనెల 23న  పీస్ 5కే రన్ ను నిర్వహిస్తున్నట్లు స్వయం సిద్ధి ఫౌండేషన్  నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు గురువారం  సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  రన్ కు సంబంధించిన కరపత్రాన్ని శ్రీధర్ యాలాల, మోడల్ మీను సింగ్  లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. నగర ప్రజలకు ఆరోగ్య సంరక్షణ పై అవగాహన కల్పించడంతోపాటు  ప్రపంచం మొత్తం శాంతి సామరస్యాలతో కొనసాగాలని ఈ రన్ ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

23న నెక్లెస్ రోడ్ లో ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా న్యాయమూర్తి విజయ్ సేన్ రెడ్డి, జిహెచ్‌ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్ లు హాజరై ప్రారంభిస్తారని చెప్పారు. బతుకమ్మ కుంట నుంచి ప్రారంభమయ్యే రన్ పీపుల్స్ ప్లాజా కు చేరుకొని తిరిగి బతుకమ్మ కుంటకు చేరుకుంటుం దని తెలిపారు. రన్‌లో విజయం సాధించిన మొదటి ముగ్గురికి నగదు బహుమతి తో పాటు ప్రశంసా పత్రాలను అందజేస్తామని తెలిపారు. రన్ లో పాల్గొనదలచిన వారు 7842893344, 7207827160 సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రియా, న్యాయవాది సత్యనారాయణ, బిజిగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.