calender_icon.png 11 December, 2025 | 5:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధితులకు ఆర్థిక సహాయం అందజేత

10-12-2025 08:08:01 PM

ఎల్లవేళలా అండగా ఉంటున్న భరోసా కేంద్రం..

ములుగు (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం పోలీస్ మహిళా భద్రతా విభాగంలో భాగంగా మహిళలలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించేందుకు భరోసా సెంటర్ లను ఏర్పాటు చేశారు. మహిళలు, పిల్లలు వారు ఎదుర్కుంటున్న లైంగిక, అత్యాచార హింసలు వంటి వేధింపులకు సహాయాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకోని బాధితులకు వన్ స్టాప్  సొల్యూషన్ గా పనిచేస్తున్నాయి. మహిళలు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలపై వారికి కౌన్సిలింగ్ నిర్వహించి వారిలో భరోసా కల్పించే దిశగా ములుగు జిల్లాలో ఏర్పాటు చేసిన ఈ భరోసా కేంద్రం విజయవంతంగా పనిచేస్తుంది. సంబంధిత కేసులను త్వరగా, సమర్ధవంతంగా నిర్వహించేలా ఒకే పై కప్పు కింద వివిధ సేవలను అందించడంతో పాటు మానసిక చికిత్, కౌన్సిలింగ్, మెడికల్, లీగల్, ప్రాసిక్యూషన్ వంటి సేవలు భరోసా కేంద్రం అందిస్తుంది.

ఇటీవల ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి వివిధ సంఘటనలలో బాదితులకు భరోసా అసిస్టెంట్ ఫండ్ నుండి జిల్లా ఎస్పి సుధీర్ రామ్నాథ్ కేకాన్ ఆదేశాల మేరకు  భరోసా నోడల్ ఆఫీసర్ ఈ. కిశోర్ కుమార్(డిఎస్పి), ఇంచార్జ్ రాజ్యలక్ష్మి.యం.(ఎస్ఐ), సెంటర్ కో ఆర్డినేటర్(అనూష), భరోసా సిబ్బంది బాధితులకు ఆర్ధిక సహాయం అంధించడం జరిగింది. అలాగే ఆర్థికంగా వెనుకబడిన ఇద్దరు బాధితులకు పై చదువుల నిమిత్తం అయ్యే ఖర్చులను ఆర్థిక సహాయంగా ఇస్తానని భరోసా నోడల్ ఆఫీసర్ ఈ. కిశోర్ కుమార్(డిఎస్పి) తెలపడం జరిగింది. భరోసా సెంటర్ ఇంచార్జ్ రాజ్యలక్ష్మి. యం.(ఎస్.ఐ.)మాట్లాడుతూ ములుగు జిల్లాలో భరోసా సిబ్బంది వివిధ అవగాహన సదస్సులు, హోమ్ విసీట్స్(భాదితుల) నిర్వహిస్తున్నారు అని తెలియజేయడం జరిగింది.