ప్యారడైజ్ సర్కిల్‌లో యూకో కొత్త బ్రాంచ్
హైదరాబాద్ సిటీబ్యూరో, మే22(విజయక్రాంతి) : సికింద్రాబాద్ ఎంజీ రోడ్‌లోని ‘యూకో బ్యాంక్’ బ్రాంచ్‌ను ప్యారడైజ్ సర్కిల్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ బిల్డింగ్ ప్రాంగణానికి మార్చారు. వినియోగదారులకు అందుబాటులో ఉండడం కోసం యూకో బ్యాంక్ నూతన బ్రాంచ్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ భవనంలోకి తరలించినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. ఈ కార్యాలయాన్ని యూకో బ్యాంక్ హైదరాబాద్ జోనల్ హెడ్, డీజీఎం ఎన్ శ్రీకాంత్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంజీ రోడ్‌లో తమ బ్యాంకు బ్రాంచ్ 1942లో ప్రారంభమైందని, ఖాతాదారుల సౌలభ్యం, వినియోగదారులకు సేవలు అందించడానికి యూకోబ్యాంక్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని చెప్పారు. దేశం లో త్వరగా అభివృద్ధి చెందుతున్న బ్యాంకుల్లో యూకో బ్యాంక్ ఒకటని, తమ బ్యాంకులో అనేక ఆకర్షణీయమైన పథకాలు, తక్కువ వడ్డీ రేట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.






