calender_icon.png 6 September, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి

06-09-2025 12:00:00 AM

బీఆర్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బుడిద రాంరెడ్డి

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 05: ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండడం ద్వారా ప్రతి ఒక్కరికీ ప్రశాంతత కలుగుతుందని బీఆర్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బుడిద రాంరెడ్డి అన్నారు. శుక్రవారం బీఆర్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో  ఇబ్రహీంపట్నం మండల పరిధిలోనీ రాయపోల్, నెర్రపల్లి గ్రామాలలోని ప్రధాన ఆలయాలకు ఊరేగింపు రథలను అందజేశారు. ఈ సందర్బంగా మాట్లా డుతూ.. యువత చెడు వ్యాసనాలకు అలవాటు పడకుండా ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాల న్నారు.

విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసై ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని, దీంతో వారి కుటుంబం రోడ్డున పడే దుస్థితి వస్తుందన్నారు. కావున యువత చెడు వ్యాసనాలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.  బీఆర్‌ఆర్ ఫౌండేషన్ సభ్యులు, మాజీ ఉపసర్పంచ్ బూడిద నర్సింహారెడ్డి, రాయపోల్ మాజీ ఎంపీటీసీ అచ్చన శ్రీశైలం, గోరిగే రమేష్, మంగ ఐలేష్, మడుపు గోపాల్, నల్ల రమేష్ గౌడ్, దొండ రమణ రెడ్డి, గంగానమోని సతీష్  పాల్గొన్నారు.