calender_icon.png 6 September, 2025 | 6:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంగమ్మ ఒడికి గణపయ్య

06-09-2025 12:00:00 AM

  1. గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ రామ్నాథ్ కేకన్ 
  2. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి

మరిపెడ సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): మహబూబాద్ జిల్లా మరిపెడ మండల మున్సిపాలిటీ మాకుల చెరువు వద్ద నిమ జ్జన ఏర్పాట్లను శుక్రవారం జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ విజయ నందన్, సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజకుమార్ గౌడ్, ఎస్త్స్ర బోలగాని సతీష్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు షేక్ తాజుద్దీన్ , కాంగ్రెస్ నాయకులు సురేష్ నాయక్, రవికాంత్, మున్సిపల్ సిబ్బంది ,గణేష్ భక్తులు ఉన్నారు.

గ్రామాల్లో..

మండలంలోని పలు గ్రామాల్లో వినాయక మండపాల వద్ద తొమ్మిది రోజులు నిత్య పూజలు అందుకున్న లడ్డు మహా ప్రసాదం, కలశం వేలం పాట ద్వారా అందుకున్న భక్తుల సంతోషాల నడుమ గణపతి నిమజ్జన వేడుకలను పిల్లలు పెద్దలు రంగులు చల్లుకుంటూ ఆటపాటలతో డప్పు చప్పులతో కోలాట

బృందాలతో పటాసులు కాలుస్తూ గణపతి మహారాజ్ కి జై అంటూ గ్రామంలోని వాడవాడల్లో ఊరేగింపుతో బయలుదేరి గణపయ్యను గంగమ్మ ఒడిలోకి చేర్చడానికి ఊరు వాడ కదిలి నిమజ్జన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా మొదలుపెట్టారు మరికొన్నిచోట్ల చివరి రోజు కావడంతో అన్నసంతర్పణ కార్యక్రమాలను నిర్వహించారు.

వైద్య శిబిరాలు ఏర్పాటు..

వడ్డేపల్లి, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): వినాయక ప్రతిమల నిమజ్జనం సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశాల మేరకు 12 ప్రదేశాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు, 108 వాహనాలను కూడా అందుబాటులో ఉంచినట్లు హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ. అప్పయ్య తెలియజేశారు. మూడు షిఫ్ట్ లలో కూడా వైద్యాధికారి సిబ్బందిని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.

గురువారం బంధం చెరువు, సిద్దేశ్వరగుండం, హసన్ పర్తి సందర్శించి, శుక్రవారం కటాక్ష పూర్, పెద్దాపూర్ చెరువు, ప్రగతి సింగారం బ్రిడ్జి, గుండ్ల సింగారం చెరువు, కమలాపూర్, హసన్ పర్తి, సిద్దేశుని గుండం, బంధం చెరువు లలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరములను ఆయన సందర్శించి తగు సూచనలు చేయడం జరిగింది. ఒక్కో షిఫ్టుకు 60 మంది చొప్పున మొత్తం 180 మంది వైద్య సిబ్బందిని డిప్యూటేషన్ చేయడం జరిగిందన్నారు.

ఈ ప్రత్యేక వైద్య శిబిరాలలో చిన్నచిన్న రుగ్మత లకు 168 మందికి చికిత్స అందించడము జరిగిందని ఆయన వివరించారు. వైద్యాధికారులు డాక్టర్ స్వాతి, డాక్టర్ సాయి కృష్ణ, డాక్టర్ నాగరాజు, డాక్టర్ శాంతి ప్రియ, డాక్టర్ నవీన్, డాక్టర్ కవిత, డాక్టర్ రోహిత్, డాక్టర్ విజయ రెడ్డి, డాక్టర్ ఇర్ఫాన్, డాక్టర్ సౌమ్య, డాక్టర్ సురేష్, డాక్టర్ సాయిశ్రీ  సూపర్వైజర్లు, ఏఎన్‌ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.