17-07-2025 01:48:03 AM
మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
మల్కాజ్‌గిరి, జులై 16 : కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు రౌడీల వ్యవహరిస్తున్నారని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి విమర్శించారు. బోనాల చెక్కులు పంపిణీ సందర్భంగా జరిగిన ఘర్షణ అంశంపై ఆయన బుధవారం బో యినపల్లిలో ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, మైనంపల్లి హను మంతరావు కాంగ్రెస్ నాయకుడిగా కాకుండా ఒక పొలిటికల్ నయీమ్ గా వ్యవహరిస్తున్నాడని, దౌర్జన్యాలు, గుండాయిజం, ల్యాండ్ కబ్జాలు, సెటిల్మెంట్లతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని మండిపడ్డారు.
బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలపై చేయిబడితే ఊరుకునేది లేదని, కార్యకర్తలను కాపాడుకునేందుకు ఎంతవరకు అయినా వెళ్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మైనంపల్లి ఒక రౌడీలా నయీమ్ తరహాలో వ్యవహరిస్తున్న తీరుకు ఆయనను పూర్తిస్థాయిలో ఎదుర్కొనటానికి సిద్ధంగా ఉన్నానని, ఇకపై ఎన్నికలు ఎలాంటివైనా మైనంపల్లి ఎక్కడ పోటీ చేస్తే అక్కడ పోటీ చేస్తానని, ఎటువంటి పరిస్థితుల్లో మైనంపల్లిని విడిచి పెట్టే ప్రసక్తి లేదని అన్నారు.
కేసిఆర్, కేటీఆర్, హరీష్ రావులపై అసబంధమైన ఆరోపణలు చేయటం కాదని, మెదక్ లో ఆడబిడ్డ పద్మ దేవేందర్ రెడ్డిపై ప్రతాపం చూపించడం కాదని, స్థానికంగా ఆయన ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మల్కాజిగిరి నియోజకవర్గంలో తనని దమ్ముంటే ఎదుర్కోవాలని మైనంపల్లి హనుమంతరావుకి మర్రి రాజశేఖర్‌రెడ్డి సవాల్ విసిరారు.