calender_icon.png 8 May, 2025 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

22-04-2025 06:54:19 PM

మండల విద్యాధికారి భూపతి శ్రీనివాస్...

హుజురాబాద్ (విజయక్రాంతి): ప్రతి ఒక్క విద్యార్థి తమ పుట్టినరోజు సందర్భంగా మొక్కను నాటాలని మండల విద్యాధికారి భూపతి శ్రీనివాస్(Mandal Education Officer Bhupathi Srinivas) అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని సింగపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దారిత్రీ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 10 సంవత్సరం ఒక మొక్కను నాటి వాటిని పరిరక్షించేందుకు కృషి చేయాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ, ఇతర బంతులు ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. పర్యావరణం పరిరక్షించడం నేటి విద్యార్థుల చేతుల్లోనే ఉందన్నారు. దారిత్రి దినోత్సవం గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాంప్రసాద్, మచ్చ పవన్, కిషన్ రెడ్డితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.