calender_icon.png 9 May, 2025 | 1:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెర్రరిజాన్ని ఉపేక్షించబోం!

08-05-2025 01:46:47 AM

  1. ‘ఆపరేషన్ సిందూర్’ నిదర్శనం

సరిహద్దు రాష్ట్రాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి..

ఎలాంటి దాడినైనా కేంద్రం ఎదుర్కొంటుంది..

హోంశాఖ మంత్రి అమిత్‌షా

సరిహద్దు రాష్ట్రాల సీఎంలతో అత్యవసర సమావేశం

న్యూఢిల్లీ, మే 7: భారత్ ఉగ్రవాదాన్ని ఉపేక్షించదనేందుకు ‘ఆపరేషన్ సిందూర్’  నిదర్శనమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో బుధవారం ఆయన త్రివిధ దళాల ఉన్నతాధికారులతో కలిసి న్యూఢిల్లీ నుంచి సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, సిక్కిం, పశ్చిమ బెంగాల్  సీఎంలు, డీజీపీలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. 

వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించి పలు అంశాలపై సలహాలు, సూచనలిచ్చారు. దేశ అంతర్గత భద్రత పరిస్థితులను సమీక్షించారు. అత్యవసర పరిస్థితుల్లో పౌరులను తర లించేందుకు బంకర్లు సిద్ధం చేయాలని సూచించారు. భద్రతా దళాలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, నిఘా వ్యవస్థలు పకడ్బందీగా పనిచేయాలని ఆదేశించారు.

సెలవుల్లో ఉన్న అధికారులు, సిబ్బందిని వెంటనే రీకాల్ చేయాలని సూచించారు. ప్రధాని మోదీ భారత్‌పై జరిగే ఎలాంటి దాడినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని, భద్రతాపరమైన అంశాలపై ఏమాత్రం రాజీ ఉండదని స్పష్టం చేశారు.