calender_icon.png 9 May, 2025 | 1:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతీకార చిహ్నం..‘ఆపరేషన్ సిందూర్’

08-05-2025 12:37:26 AM

న్యూఢిల్లీ, మే 7: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై మంగళవారం అర్ధరాత్రి భారత్ విరుచుకుపడింది. తొమ్మిది ఉగ్రస్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో దాడులు చేసినట్లు సైన్యం ప్రకటించింది. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్ మా త్రమే కాదు ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్ వణి కిపోయే పరిస్థితి వచ్చింది. ఈ పేరును ప్రధా ని నరేంద్రమోదీ స్వయంగా పెట్టినట్లు కథనాలు వెలువడుతున్నాయి.

‘మన మహిళలు భర్తలను కోల్పోయారు.. ఈ ఘాతాకానికి పా ల్పడిన వారిని భారత్  ఎక్కడున్నా వదిలిపెట్టదు అనేలా మన ప్రతిస్పందన కనిపిం చాలి’ అని ప్రధాని అధికారులకు స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా కూడా ‘ఆపరేషన్ సిందూర్’ను చూడొచ్చని చెబుతున్నారు.

యోధులకు పెట్టే వీరతిలకం అనే అర్థం కూడా ఇందులో ఉండటం విశేషం.ఉగ్రమూకలు లక్ష్యంగా చేసుకున్న జంటల్లో అప్పటికీ ఆరు రోజుల క్రితమే వివాహమై, హనీమూన్‌కు వచ్చిన నవదంపతులు వినయ్ నర్వాల్, హిమాన్షిని టెర్రరిస్టులు చుట్టుముట్టి వినయ్‌ను హత్య చేయగా, అతడి మృతదేహం పక్కన హిమాన్షి గుండెలవిసేలా రోదించిన చిత్రం దేశం మొత్తాన్ని బాధపడేలా చేసింది.