22 June, 2026 | 2:59 AM

ప్రతి ఒక్కరూ నిత్యం యోగాభ్యాసం చేయాలి

22-06-2026 12:00 AM

ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్, జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు

చిట్యాల, జూన్ 21: ప్రతి ఇంటికి యోగ చేరాలని, ప్రతి ఒక్కరూ నిత్యం యోగాభ్యాసం చేయాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్, నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు పిలుపునిచ్చారు. ఆదివారం చిట్యాల మండలం ఊరుమడ్ల గ్రామంలోని రైతు వేదిక వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ పల్లపు బుద్ధుడు ఆధ్వర్యంలో యోగా, ధ్యాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పల్లపు బుద్ధుడు యోగా ఆసనాలు, ధ్యాన విధానాలను ప్రదర్శించి పాల్గొన్న వారితో సాధన చేయించారు. ‘హర్ ఘర్ ధ్యాన్ జీవించడం ఒక కళ‘ అనే సందేశంతో ప్రతి ఇంటికి యోగ చేరాలని, ప్రతి ఒక్కరూ నిత్యం యోగాభ్యాసం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. యోగా, ధ్యానం, శ్వాసక్రియల ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, సుదర్శన క్రియ ఒత్తిడిని తగ్గించి జీవశక్తిని పెంపొందిస్తుందని వివరించారు.

వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడటంతో పాటు రక్తపోటు, మధుమేహం, ఉబ్బసం వంటి సమస్యలను నియంత్రించడంలో యోగా ఉపయోగపడుతుందని తెలిపారు. పల్లపు బుద్ధుడిని శాలువాతో సన్మానించి గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, వార్డు సభ్యులు పాకాల దినేష్, మేడబోయిన స్వాతి శ్రీనివాస్ యాదవ్, గంగాపురం రాము, ఉపాధి హామీ ఫీల్ అసిస్టెంట్ మర్రి రమేష్, పాకాల సత్యనారాయణ, గంగాపురం వెంకన్న, వస్కుల శంకర్, ఉయ్యాల మల్లేష్, వావిళ్ల మహేష్, మాధగోని నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.