calender_icon.png 7 October, 2025 | 3:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వం సిద్ధం

07-10-2025 12:30:09 AM

  1. జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం

మూడు విడతల్లో గ్రామ పంచాయితీ ఎన్నికలు 

రెండు విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ  ఎన్నికలు 

వికారాబాద్, అక్టోబర్- 6: వికారాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్ట కార్యాచరణ అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పేర్కొన్నారు.  సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఎన్ ఐ సి హాలు నందు  స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్,  డిపిఓలతో కలిసి జిల్లా కలెక్టర్ పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రం లో ఎంపిటిసి, జెడ్పిటిసి, గామ పంచాయతీ సాధారణ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందని పేర్కొన్నారు. గ్రామపంచాయితి ఎన్నికలను మూడు విడతలుగా జిల్లాలోని 20 మండలాల్లోని 594 గ్రామపంచాయితీలకు 5058 వార్డులలోని పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని అదే విధంగా 20 జడ్పిటిసి, 227 యంపిటిసి స్థానాల ఎన్నికలను రెండు విడతలలో నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లను సిద్ధం చేయడం జరిగిందని అన్నారు. 

గ్రామపంచాయితి ఎన్నికలను రెండవ విడతలో కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్ పేట్, దుద్యాల, వికారాబాద్, ధరూర్, మోమిన్ పేట, నవాబ్ పేట్, బంట్వారం, మార్పల్లి, కోట్ పల్లి 11 మండలాల్లొని 288 గ్రామపంచాయితిలలో 2490 వార్డులలో,  మూడవ విడతలో పరిగి, పూడూర్, కుల్క చెర్ల, చౌడాపూర్, దోమ, తాండూర్, భాసీరా బాద్, యాలాల్, పెద్దేముల్, 9 మండలాల్లోని 306 గ్రామపంచాయితిలలోని 2568 వార్డులలో  ఎన్నిక లను  నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 

జడ్పిటిసి, యంపిటిసి ఎన్నికలను రెండు విడతలలో 594 గ్రామపంచాయితీలలోని  ఏర్పాటు చేసిన పొలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.  నోటిఫికేషన్ వెలువడిన నాటి నుండి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో పటిష్టమైన చర్యలు తీసుకున్నామని,జిల్లా లో మొత్తం ఓటర్లు 6,98 ,472 మంది, పురుషులు 3,43,668, మహిళలు 3,54,788, ఇతరులు  16,మొత్తం పోలింగ్ స్టేషన్ లు  1289,పోలింగ్ లొకేషన్లు  614, మొదటి విడత లో 11 మండలాలు 115 ,రెండవ విడత లో 09మండలాలు 112, మొత్తం 227 ఏం పి  టి సి, జడ్  పి టి సి స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు.

డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు 4, రిసిప్సన్ సెంటర్లు 4, స్ట్రాంగ్ రూమ్స్ 3, కౌంటింగ్  సెంటర్స్ 3  ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందుకొరకు 12 జిల్లా నోడల్ అధికారులు, 105 మంది జోనల్ స్థాయి అధికారులు,  45 ఫ్లయింగ్ స్క్వార్డ్ టీం లు, 59 సిట్టింగ్ స్క్వేడ్స్ టీంలు, 20 యంసిసి బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హార్స్ చౌదరి, డిపిఓ జయసుధ , పత్రిక విలేకరులు తదితరులు పాల్గోన్నారు.

  1. అధికారులు తమ విధులను సమర్ధవంతంగా నిర్వహించాలి
  2. కలెక్టర్, ఎన్నికల అధికారి సి.నారాయణరెడ్డి 

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 6: పంచాయతీ ఎన్నికల్లో అధికారులు తమ విధులను సమర్ధవంతంగా నిర్వహించాలనీ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి సి.నారాయణరెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పోలీస్ అధికారులు, ఎంపీడీవోలు, ఎన్నికల నోడల్ అధికారులు, అడిషనల్ కలెక్టర్లతో కలిసి జిల్లాస్థాయి సమన్వయ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ ప్రక్రియ నుండి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ ప్రక్రియ, నామినేషన్ల పరిశీలన, పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా తదితర అంశాలపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. విధులు కేటాయించిన అధికారులు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఖచ్చితంగా పాటించాలని ఆయన అధికారులకు సూచించారు. మండల స్థాయి ఎన్నికల అధికారులు ఒక టీం గా ఏర్పడి సమన్వయంగా పనిచేయాలని తెలిపారు.

రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సభలు, ర్యాలీలు సమావేశాల కొరకు అనుమతి పొందాల్సి ఉంటుందని సంబంధిత సమాచారాన్ని ఖర్చుల  పర్యవేక్షణ బృందానికి అందించనట్లైతే నిబంధనలకు లోబడి ఖర్చుల పరిశీలన చేస్తారని అన్నారు.   ఫ్లయింగ్  సర్వేలెన్స్ టీం, స్టాటిస్టిక్ సర్వేలెన్స్ టీంలు, ఆయా  టీంలలో పోలీసు శాఖ సిబ్బంది తప్పని సరిగా ఉండాలని ఆయన తెలిపారు.  అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ..  నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు ప్రొసైడింగ్, సహాయ ప్రొసైడింగ్ అధికారులకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ అందించడం జరిగిందని తెలిపారు.

స్ట్రాంగ్ రూమ్, బ్యాలెట్ బాక్స్, బ్యాలెట్ పేపర్ ఇతర ఎన్నికల సంబంధిత ప్రతి అంశంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పోలీసు శాఖ అన్ని శాఖలతో సమన్వయంగా పనిచేస్తూ ఎన్నికలను సమర్దవంతంగా నిర్వహిం చడం జరుగుతుందని  డిసిపి సునీతారెడ్డి తెలిపారు. అడిషనల్ డిసిపిలు సమస్యాత్మక  గ్రామాలను త్వరలో గుర్తించి తగిన విధంగా బందోబస్తు ఏర్పాట్లకు  ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, సైబరాబాద్ పోలీస్ శాఖ అడిషనల్ డీసీపీలు, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్, అభ్కరి శాఖ సుపరిడెంట్లు కృష్ణప్రియ, జిల్లా ఎన్నికల నోడల్ అధికారులు, రెవెన్యూ డివిజినల్ అదికారులు, ఎంపీడీవోలు తదితర అధికారులు తదితరులు పాల్గొన్నారు.