calender_icon.png 16 December, 2025 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొదటి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం

11-12-2025 12:00:00 AM

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

ఖమ్మం, డిసెంబర్ 10 (విజయ క్రాంతి): మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే గ్రామాల్లో పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రజలు ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా స్వేచ్ఛ గా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పిలు పు నిచ్చారు. డిసెంబర్ 11న మొదటి విడతలో నిర్వహించే గ్రామ పంచాయతీల ఎన్ని కల సందర్భంగా రఘునాథపాలెం మండల కేంద్రంలోని రైతు వేదిక ప్రాంగణం నందు ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలను బుధవారం జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.

డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలలో బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ లో వినియోగించే ఎన్నికల సామాగ్రిని పరిశీలించి, పోలింగ్ సిబ్బం దితో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పలు సూచనలు చేస్తూ, ఓటర్ లకు బ్యాలెట్ పేపర్స్ ఇవ్వడం, పివో డైరీ నింపడం, అన్ని ఫారమ్స్ ఎలా నింపాలి, ఏజెంట్స్ సిగ్నేచర్ తీసుకోవడం, పోలింగ్ పూర్తి అయిన తర్వాత బ్యాలె ట్ బాక్స్ సీలింగ్, ఓట్ల కౌంటింగ్, సర్పంచ్ నియామక పత్రాలు ఇవ్వడం, ఉప సర్పంచ్ ఎన్నిక తదితర అంశాల మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల విధులు నిర్వహించే వారు,

వారికి ఏర్పాటు చేసిన చోటనే బస చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ నేడు మొదటి విడతలో జిల్లా నందు ఏడు మండలాలలో సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు పోలింగ్ జరుగుతుందని అన్నా రు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగుతుందని, ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుండి కౌంటింగ్ నిర్వహించి, ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తి చేసి ఫలితాలను వెల్లడిస్తామన్నారు.

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు కల్పించామని వివరిం చారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ గుర్తించి క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశామని, సీసీ కెమె రా ద్వారా నిరంతర పర్యవేక్షిస్తామని, సెన్సిటివ్ కేంద్రాలలో మైక్రో అబ్జర్వర్లు నియ మించినట్లు కలెక్టర్ తెలిపారు. 

ఈ కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీవో జి. నరసింహారావు, రఘునాధపాలెం తహసీల్దారు శ్వేత, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.