11-12-2025 12:00:00 AM
కలెక్టర్ జితేష్ వి పాటిల్
భద్రాచలం, డిసెంబర్ 10, (విజయక్రాంతి):భద్రాచలం నియోజకవర్గంలోని గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల సామాగ్రిని సెక్టార్లవారీగా సంబంధిత పోలింగ్ స్టేషన్లకు భద్రత నడుమ సిబ్బందిని తరలించడం జరిగిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటైల్ అన్నారు.
బుధవారం భద్రాచలం లో ని మండల పరిషత్ కార్యాలయంలో సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబం ధించిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రా హుల్ తో కలిసి పోలింగ్ సిబ్బందికి సలహా లు, సూచనలు ఇచ్చి వారి వారి పోలింగ్ స్టేషన్ లకు పంపిన అనంతరం ఆయన మా ట్లాడుతూ గురువారం నాడు జరిగే గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పోలింగ్ స్టేషనులకు ప్రత్యేక పోలీస్ భద్రత నడుమ పూర్తిస్థాయి సెక్యూరిటీతో ఆయా సెక్టార్లకు పంపించడం జరిగిందని అన్నారు.
ప్రతి సెక్టార్ రూటులవారీగా పోలింగ్ స్టేషన్లను బట్టి సిబ్బందిని చేరవేయడానికి 20 టాటా మ్యాజిక్ వాహనాలతో పది లొకేషన్లలో ముగ్గురు రూట్ ఆఫీసర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, 60 పోలింగ్ స్టేషన్లకు గాను, 60 పోలింగ్ స్టేషన్కు 60 పిఓ లు, 240 ఓపిఓ లు మరియు రిజర్వుగా 50 మంది పోలింగ్ సిబ్బందిని కూడా నియమించడం జరిగిందని అన్నారు.
ఎన్నికల విధులకు వెళ్లే పోలింగ్ స్టేషన్ల సిబ్బందికి చలికాలాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి అన్ని సౌ కర్యాలు కల్పించడం జరిగిందని, అలాగే పోలింగ్ స్టేషన్లలో కరెంటు, మంచినీటి సౌక ర్యం కల్పించడం జరిగిందని, పోలింగ్ స్టేషన్లలో నియమించబడ్డ సిబ్బందికి ముందుగా పోలింగ్ మెటీరియల్ ఇవ్వడం జరిగిందని, వారు సామాగ్రి సరిచూసుకున్న అనంతరం గ్రామపంచాయతీ జిల్లా రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరావు మరియు సహాయ ఎన్నికల అధికారి నారాయణ సమక్షంలో పోలీస్ స్టేషన్ నుండి బ్యాలెట్ బాక్సులు తీసుకొని వచ్చి పోలింగ్ సిబ్బందికి అందించడం జరిగిందని అన్నారు.
ప్రతి పోలింగ్ స్టేషన్లో పోలింగ్ సిబ్బందికి అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని, సంబంధిత పోలింగ్ సిబ్బంది వారి వారి పోలింగ్ స్టేషన్లకు చేరుకున్న తర్వాత 11 వ తేదీనాడు జరిగే ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఈరోజు సాయంత్రం వరకు పూర్తి చేసుకోవాలని, 11 వ తేదీ ఉదయం సెక్టరల్ ఆఫీస ర్లు, పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్ కు సిల్ వేసి ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించాలని,
మధ్యా హ్నం ఒంటిగంట వరకు పోలింగ్ అయిపోయే సమయంలో ఓటర్లు గనక ఉంటే ప్ర త్యేకంగా తయారు చేసిన స్లిప్పులను అం దించి ఓటింగ్ ప్రక్రియ అయిపోగానే సామాన్లన్నీ జాగ్రత్తగా తీసుకొని భద్రత నడుమ సెక్టర్ ఆఫీసర్ల సమక్షంలో తిరిగి తీసుకురావాలని అన్నారు. పోలింగ్ సిబ్బందికి ఏ చిన్న సమస్య వచ్చినా సొంతంగా నిర్ణయం తీసుకోవద్దని, ఏ సమస్య ఉన్న సంబంధిత సెక్టరల్ అధికారికి మరియు ఏఆర్‌ఓకి తెలియజేయాలని అన్నారు. పోలింగ్ ఏజెంట్ల ద్వారా టెండర్ ఓటు, ఛాలెంజ్ ఓటు గురిం చి సమస్య వస్తే వెంటనే పై అధికారుల దృ ష్టికి తీసుకువచ్చి సమస్య పరిష్కరించుకోవాలని అన్నారు.
ఓటింగ్ ప్రక్రియ ప్రారంభ మైన దగ్గర్నుండి అన్ని పోలింగ్ స్టేషన్ ల నుండి గంటకు ఒకసారి పోలింగ్ సరళిని త ప్పనిసరిగా ఏఆర్‌ఓకి తెలియజేయాలని అన్నారు. పోలింగ్ సెక్టరల్ అధికారుల నుం డి మొదలుకొని పి ఓ లు, ఏపీవోలు ,ఓపిఓలు మరియు పోలింగ్ స్టేషన్లో వివిధ పను లకు నియమించిన సిబ్బంది అందరూ కలిసికట్టుగా ఉండి గ్రామపంచాయతీ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా సహకరించాలని అన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మ్రినాలి శ్రేష్ట, ఏ ఎస్ పి విక్రాంత్ కుమార్ సింగ్,తాసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, ఆర్‌ఐలు, ఎంపీడీవో, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.