07-05-2025 12:00:00 AM
ఎంట్రీ పాస్‌లకు రిజిస్ట్రేషన్లు షురూ
హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): రాష్టప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న 71వ మిస్ వరల్డ్ పోటీలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని మంగళవారం పర్యాటకశాఖ ప్రకటించింది. బుధవారం నుంచి ఈనెల 31 వరకు పోటీలు జరుగుతాయని, పోటీల్లో సుమారు 140 దేశాల నుంచి అం దగత్తెలు పాల్గొంటారని పేర్కొన్నది. ఈవెంట్‌కు విచ్చేసేందుకు కాంప్లిమెంటరీ ఎంట్రీ పాస్‌లు ఇస్తున్నామని, ఆసక్తి ఉన్నవారు http://tourism.telangana.inలో రిజిష్టర్ చేసుకోవచ్చని సూచించింది. పాస్‌ల వివరాలను వ్యక్తిగత మెయిల్‌కు సమాచారం అందిస్తామని స్పష్టం చేసింది.