07-05-2025 12:00:00 AM
సామాజిక అధ్యయన రాష్ట్ర అధ్యక్షుడు పార్నాంది రామయ్య
గూడూరు, మే 6 : భారతదేశ చరిత్రలో దళిత బహుజనుల బ్రాహ్మణులు పెత్తనం నుంచి విముక్తి చేయడానికి సైదాంతికంగా పాలనాపరంగా మహాత్మ జ్యోతిరావు పూలే చత్రపతి శివాజీ ల వారసుడిగా చత్రపతి సాహు మహారాజ్ కృషిచేసి భవిష్యత్తు భారతానికి సామాజిక న్యాయం ప్రజాస్వామిక తత్వ పునాదిగా ఏర్పరిచిన ప్రజల రాజుగా మిగిలిపోయాడని సామాజిక అధ్యయన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు పార్నంది రామయ్య అన్నారు.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో చత్రపతి సాహు మహారాజ్ 13వ వర్ధంతి వేడుకలు సామాజిక అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు రామయ్య మాట్లాడుతూ పితృ సామ్యకుల మతవ్యవస్థల వల్ల స్త్రీల మీద జరుగుతున్న అమానుష సంఘటనలు గ్రహించి సాహో మొదట తన భార్య లక్ష్మీబాయికి యూరోపియన్ టీచర్ల ద్వారా ఆధునిక విద్యను చెప్పించాడని సంగీతంలో చిత్రలేఖనంలో ఎంబ్రాయిడర్ లో శిక్షణ ఇప్పించాడని తెలిపారు.
కొల్లాపూర్ సంస్థానంలో బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ప్రారంభం చేశాడని ఉన్నత విద్యలోకి బాలికలను ప్రోత్సహించేందుకు ఉపకార వేతనాలు ప్రోత్సహితులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సాహూ మహారాజ్ ఎంతో నిబద్దతతో సామాజిక ఉద్యమాల్లో పాల్గొని విజయవంతం చేశారని దక్షిణ భారతదేశంలో జస్టిస్ పార్టీ ఉద్యమంతో పాటు భారతదేశంలో ప్రభావం చూపించిన సాహు మహారాజ్ మే 6 1922 నా మరణించడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో సామాజిక అధ్యయన వేదిక ఉపాధ్యక్షుడు వెంకన్న మండల అధ్యక్షుడు చెంచు బాలయ్య ఎంఆర్సి సిబ్బంది సుధాకర్ సంపత్ దళిత రత్న గ్రహీత బోడ ఎల్లయ్య వెంకన్న తదితరులు పాల్గొన్నారు.