calender_icon.png 23 January, 2026 | 11:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వసంత పంచమి వేడుకలకు సర్వం ముస్తాబు

23-01-2026 12:00:00 AM

నిర్మల్/భైంసా, జనవరి ౨౨ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం నిర్వహించే వసంత పంచమి వేడుకలకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. వసంత పంచమి వేడుకలను పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించనున్నారు.

భక్తులకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పా ట్లు చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఎస్పీ జానకి షర్మిల ఎమ్మెల్యే రామారావు పటేల్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాసర ప్రధాన ఆలయంతో పాటు గోదావరి పుష్కర ఘాట్ ల వద్ద రైల్వే స్టేషన్ స్థానిక బస్టాండ్ విడిది కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బాసరలో రద్దీ ఉండే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ సమస్య తలితకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పి రాజేష్ మీనా స్థానిక పోలీసులు పాల్గొన్నారు.