calender_icon.png 23 January, 2026 | 9:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా సీతారాముల కల్యాణం

23-01-2026 12:00:00 AM

సిద్దిపేట, జనవరి 22 (విజయక్రాంతి): లోక కల్యాణార్థం సిద్దిపేటలో సీతారాముల కల్యాణం నిర్వహించామని కౌన్సిలర్ దీప్తి నాగరాజు, ఉత్సవ నిర్వాహక కమిటీ నాయకులు లక్ష్మీనాథం తెలిపారు. పట్టణంలోని సుభాష్ రోడ్డు దుకాణ సముదాయాల ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారు. ఆ సీతారాముల దీవెనలు ప్రజలందరిపై ఉండాలని, వర్షా లు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని ఆకాంక్షించారు.