12-12-2025 01:48:02 AM
95 ఏళ్ల వయసులో పోటీ చేసి గెలిచిన మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి
180 ఓట్ల మెజారిటీ
సూర్యాపేట, డిసెంబర్ 11 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లాలోని నాగారం స ర్పంచుగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి విజయం సాధించారు. 95 ఏండ్ల వయస్సు లో బీఆర్‌ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. అయితే అంత వయస్సులోనూ యువకులతో సమానంగా ప్రచారం నిర్వహించారు.
గురువారం జరిగిన ఎన్నికల్లో ప్ర త్యర్థి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వెంకటబిక్షంపై 180 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన గెలుపుతో బీఆర్‌ఎస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. ఇంత వయస్సులోనూ ఆయన పట్టుదల కారణంగానే గెలుపొందాడని ఏదైనా సాధించా లంటే ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని పలువురు చర్చించుకుంటున్నారు.